సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 27 జులై 2024 (14:10 IST)

పారిస్ లో ఒలింపిక్ టార్చ్ తో చిరంజీవి, సురేఖ

Chiranjeevi and Surekha with the Olympic torch
Chiranjeevi and Surekha with the Olympic torch
పారిస్ లో 2024 ఒలంపిక్స్ నిన్న గ్రాండ్ గా  మొదలుపెట్టారు. ప్రపంచ దేశాల నుంచి ఎంతోమంది క్రీడాకారులు పాల్గొనబోతున్నారు. చిరంజీవి, రామ్ చరణ్ ఫ్యామిలీ కూడా అక్కడికి వెళ్ళారు. ఇప్పటికే రామ్ చరణ్ ఒలిపింక్ కు వెళ్ళి అక్కడ స్టేడియంలో క్రీడాకారులను చూస్తున్న ఫొటోను షేర్ చేశారు. ఇక మెగా స్టార్ చిరంజీవి, సురేఖతో పాటు, ఒలింపిక్ టార్చ్ ప్రతిరూపాన్ని పట్టుకుని ఒక ఆనందకరమైన క్షణాన్ని పంచుకున్నారు. అంతేగాక మన భారతదేశం గర్వించదగ్గ భారత బృందంలోని ప్రతి క్రీడాకారుడికి శుభాకాంక్షలు తెలిపారు.
 
రెండు రోజుల క్రితమే చిరంజీవి, భార్య సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, క్లిన్ కారా వెకేషన్ కి లండన్ వెళ్లి అటునుంచి పారిస్ ఒలంపిక్స్ కి వెళ్లినట్టు తెలుస్తోంది. చిరంజీవి ఒలంపిక్ టార్చ్ పట్టుకొని తన భార్య సురేఖతో కలిసి పారిస్ విధుల్లో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసారు. పారిస్ లో కూడా చిరు రేంజ్ మాములుగా లేదుగా అని అభిమానులు స్పందిస్తున్నారు.