సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 17 మే 2021 (23:43 IST)

చిరంజీవి `డు ఇట్‌` సేవ‌లు (video)

Chiru do it service
మెగాస్టార్ చిరంజీవి నెల‌కొల్పిన డు ఇట్ పేరుతో క‌రోనా కాలంలో ఆయ‌న అభిమానులు చేస్తున్న సేవ‌ల గురించి చిరంజీవి వీడియో విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా వారు ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. ప్ర‌జారాజ్యం పార్టీ కాలంలో కొంత‌మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు నెల‌కొల్పిందే డు ఇట్.
 
తెలుగు రాష్ట్రాల చరిత్రలో సేవాగుణం అని పదానికి ఒక నిర్వచనం గా వుంటూ తెలుగు సినీ పరిశ్రమకే పెద్ద దిక్కుగా వుంటున్న మెగాస్టార్ చిరంజీవి గారు.. 
ఎవరు ఎ ఆపదలొ వున్నా నీను వున్నా అంటూ పలకరించే ఒక ఆపద్భాందవుడుగా,
అన్నయ్యా అని మా లాంటి తమ్ముళ్ళు, అభిమానులు అభిమానంగా పిలుచుకునే మహోన్నత శిఖరం గా వున్న మీరు..
 
మీ స్పూర్తితో మా  స్థాయిలో మీము తలపెట్టిన ఒక చిరు ప్రయత్నానికి మీరు మద్దతు తెలుపుతూ ఒక ఆడియో సందేశం పంపించటం మాకు మీరు ఇచ్చిన అతి పెద్ద బహుమానం.  ఈ బహుమానం మాకు ఎప్పటికి గుర్తు వుంటుంది. 
 
మీరు స్థాపించిన ప్రజారాజ్యం లో మా వంతుగా ఉడతా బక్తిగా మీ ప్రయత్నానికి చేదోడుగా వుంటూ ఆ రోజు ప్రారంభించిన DO IT అనే సంస్థ ఈ రోజు మీ స్పూర్తితో covid అనే మహమ్మారితో పోరాడుతున్న అనేక మందికి ఉపయోగపడే విధంగా వివిధ కార్యక్రమాలు చేస్తుందని చెప్పటానికి చాల సంతోసిస్తున్నాము. 
 
ఈ కార్యక్రమములో అనేకమంది వివిధ రకాలైన సేవలు, ఆక్సిజన్ అందుబాటులో లేని వారికి ఆక్సిజన్ అందచేయటం, హాస్పిటల్ లో బెడ్స్ ఏర్పాటుచేయటం, మందులు దొరకని వారికి మందులు అందేవిధంగా చూడటం, అన్నింటి కన్నా ముక్యం గా వివిధ రంగాలలో అనుభవజ్ఞులు అయిన వైద్యుల చేత online కన్సల్టేషన్ ద్వారా అందరికి ఉపయోగ పడే పలు సూచనలు సలహాలు ఇస్తూ మందులు ప్రేస్క్రిబే చేయటమే కాకుండా వారు వేలుబుచ్చే పలు సందేహాలకు బదులు చెబుతూ ఈ కారోనా ని ఎదుర్కొనే మానసిక ధైర్యాన్ని కలుగ చేయటం చేస్తూ ఉన్నాము. 
 
దీనికంతటికి స్పూర్తి నిచ్చినది మాకు ఆదర్శంగా నిలిచేది మెగాస్టార్ చిరంజీవిగా మీరే. 
మా శ్వాస ఉన్నంత వరకు మీ ఆశయ సాధనలో భాగామవుతూ మీ బాటలో నడుస్తూ సమాజానికి మావంతు గా మాకు చేతనయినది చేస్తూ ఉంటామని ప్రతిజ్ఞ చేస్తూ,
 
సదా మీ బాటలో 
మీ అనుచరులు.
అనేక నమస్కారాలుతో
 
మీ DO IT Team