రూ.వంద కోట్ల క్లబ్లో 'డాకు మహారాజ్' - 4 రోజుల్లో రూ.105 కోట్లు కలెక్షన్లు!!
యువరత్న నందమూరి బాలకృష్ణ - బాబీ కొల్లి కాంబినేషన్లో వచ్చిన చిత్రం "డాకు మహారాజ్". సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 12వ తేదీన విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన నాలుగు రోజుల్లో ఏకంగా రూ. 105 కోట్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి తమిళంలో కూడా విడుదల చేస్తున్నారు. కింగ్ ఆఫ్ సంక్రాంతి అంటూ ప్రత్యేక పోస్టర్ను నిర్మాణసంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేసింది. అలాగే, ఈ చిత్రాన్ని శుక్రవారం నుంచి తమిళంలో కూడా విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది.
ఇకపోతే, ఈ సినిమా విడుదలైన మొదటి రోజైన ఆదివారం ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.56 కోట్లు వసూలు చేసి హీరో బాలకృష్ణ సినీ కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన మూవీగా నిలిచింది. నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించగా, ఎస్ఎస్ థమన్ సంగీత స్వరాలు సమకూర్చారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైశ్వాల్, ఊర్వశి రౌతేలా, శ్రద్ధా శ్రీనాథ్లు హీరోయిన్లుగా నటించారు.