శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : సోమవారం, 29 ఏప్రియల్ 2019 (12:20 IST)

పెళ్లిపీటలెక్కిన ఢీ డ్యాన్స్ మాస్టర్... ఎనిమిదేళ్ల ప్రేమ

తెలుగు బుల్లితెరలో టాప్ ప్రోగ్రామ్స్‌లో ఒకటిగా కొనసాగుతున్న డ్యాన్స్ ప్రోగ్రామ్ "ఢీ"తో మంచి క్రేజ్ సంపాదించుకున్న డ్యాన్స్ మాస్టర్ యశ్వంత్ బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే. ఈయన వివాహం తన చిన్ననాటి స్నేహితురాలు వర్షతో శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. 
 
ఈ సందర్భంగా ఆయన పంచుకున్న పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా 'మాది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. ఆమె నా చిన్ననాటి స్నేహితురాలు, కాలేజ్‌మేట్. ఎనిమిదేళ్ల నుంచి మా ప్రేమబంధం సాగుతోంది. లైఫ్‌లో సెటిలయ్యాక ఇంట్లో చెప్పాలనుకున్నాము. ఇప్పుడు ఎవరి ప్రొఫెషన్‌లో వారు సెటిలయ్యాం కాబట్టి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాక ముందు మా అమ్మానాన్నలకు చెప్పాం, తర్వాత వారు వర్ష పేరెంట్స్‌తో మాట్లాడగా వారు కూడా ఒప్పుకున్నారని తెలిపారు.
 
వర్ష ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా పని చేస్తోంది. మొదట్లో నా వద్ద ఏమీ లేనప్పటి నుండి ఇప్పటి దాకా నాకు అన్ని విషయాల్లో సపోర్టింగ్‌గా ఉంది. తన సపోర్ట్ వల్లనే నేను ఈ స్థాయికి రాగలిగాను. ఆమె ఎంకరేజ్‌మెంట్ మరువలేనిది. నన్ను చూసి గర్వంగా ఫీలవుతుంది, కానీ ఆ విషయాలు నాతో ఎప్పుడూ నేరుగా చెప్పదు. సోషల్ మీడియాలోనో లేదా స్నేహితులతోనో పంచుకుంటూ ఉంటుందని పేర్కొన్నారు.