శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 28 డిశెంబరు 2016 (12:24 IST)

కరణ్ జోహార్ నన్ను కాదు.. జాక్వెలిన్‌ను కూడా అలాగే తాకాడు: అనుష్క సెన్సేషనల్ కామెంట్స్

''కాఫీ విత్ కరణ్'' ప్రోగ్రామ్ బాగా హిట్ అవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సెలబ్రెటీలతో జరిగే కార్యక్రమంలో వివాదాస్పద ప్రశ్నలకు తావుంటుంది. తాజాగా అనుష్క శర్మ, కత్రినా కైఫ్‌లతో కరణ్ జోహార్ చేసిన ఎపిసో

''కాఫీ విత్ కరణ్'' ప్రోగ్రామ్ బాగా హిట్ అవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సెలబ్రెటీలతో జరిగే కార్యక్రమంలో వివాదాస్పద ప్రశ్నలకు తావుంటుంది. తాజాగా అనుష్క శర్మ, కత్రినా కైఫ్‌లతో కరణ్ జోహార్ చేసిన ఎపిసోడ్ కూడా జనాలలో మాంచి క్రేజ్ సంపాదించి బాగా విజయవంతమైంది. ఈ ఎపిసోడ్‌లో అనుష్క శర్మ, కరణ్ జోహార్ మీద సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. 
 
కరణ్ దర్శకత్వంలో 'యే దిల్ హై ముష్కిల్' సినిమా షూటింగ్ సందర్భంగా తనను అభ్యంతరకర రీతిలో తాకాడని ఆరోపించింది. దీనికి కరణ్ స్పందిస్తూ.. తనకు అనుష్క మీద ప్రేమ పుట్టిందని, ఆమె అందం తన దృష్టిని ఆకర్షించిందని.. ఆ మాయలో పడిపోయానని బదులిచ్చాడు. అనంతరం అనుష్క ఇంకొంచెం సీరియస్ అయి, కరణ్ మీద లైంగిక వేధింపుల కేసు పెట్టాలని ఉందని చెప్పాడు.
 
ఆ సమయంలో జోక్యం చేసుకున్న కత్రినా, నీలో చురుకుదనం తీసుకురావడానికే రెచ్చగొట్టి సంచలనం సృష్టించటానికే కరణ్ అలా చేసి ఉంటాడంటూ కవర్ చేసే ప్రయత్నం చేసింది. అనుష్క అంతటితో ఆగకుండా ఓ పార్టీలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను కూడా అసభ్యంగా తాకాడంటూ కరణ్ మీద ఆరోపణలు చేసింది. దీంతో ప్రోగ్రామ్ మరింత రసపట్టుకు చేరుకుంది. మరి అనుష్క ఆరోపణలు సరదాకు చేసినవా లేకుండా స్క్రిప్ట్ ప్రకారం చేసినవా అని తేలాల్సి ఉంది.