శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (19:44 IST)

భూమిక‌లో నాజూకు త‌గ్గ‌లేదు కానీ.. అంటున్న ఫ్యాన్స్‌

Bhumika Chawla
Bhumika Chawla
హీరోయిన్ భూమిక చావ్లా స‌క్సెస్ సినిమాలు చేసింది. ఖుషిలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో అమ్మాయే స‌న్న‌గా.. అంటూ పాడిన పాట‌కు అభిమానులు ఫిదా అయిపోయారు. కానీ భరత్‌ఠాకూర్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె న‌ట‌న‌కు దూర‌మ‌యింది. అయితే అప్పుడప్పుడు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా వుండేది. దానికి నెటిజ‌న్లు ప‌లుర‌కాలుగా స్పందించేవారు. ఫేస్‌లో గ్లోత‌గ్గినా నాజూగ్గా వుందంటూ కొంద‌రు స్పందిస్తే, 40 త‌ర్వాత ఎలాగూ గ్లామ‌ర్ త‌గ్గుతుంద‌ని మ‌రికొంద‌రు కామెంట్ చేస్తున్నారు. అన్నింటినీ పాజిటివ్‌గా తీసుకున్న భూమిక ఇప్పుడు బాలీవుడ్ సినిమాలో న‌టించింది. 
 
ఆపరేషన్ రోమియో చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈమెను గురించి ప్ర‌మోష‌న్‌లో భాగంగా హీరో సిద్ధాంత్‌ గుప్త ఆమెను అభినందిస్తూంటే ముసిముసి న‌వ్వులు చిందిస్తూ ఇలా త‌న సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేసింది. త్వ‌ర‌లో మ‌రో సినిమాలో చేయ‌నున్న ఆమె తెలుగులో నానితో ఎం.సి.ఎ.లో వ‌దిన పాత్ర‌లో న‌టించింది. తాజాగా వంకాయ కలర్ పంజాబీ డ్రెస్‌తో ఫోజులిస్తున్న పిక్స్‌ని ఇన్‌స్టా హ్యాండిల్‌లో షేర్ చేసింది భూమిక. తన సెకండ్ డే ప్రమోషన్ అంటూ ఆపరేషన్ రోమియో సినిమా గురించి కోడ్ చేసింది.
అంత‌కుముందు తెలుగు, త‌మిళంలో తకిట తకిట అనే సినిమా తీసి భారీగా న‌ష్ట‌పోయింది. ఆ త‌ర్వాత త‌న భ‌ర్త‌తో విభేదాలు వ‌చ్చాయ‌ని తెలుస్తోంది.