సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 నవంబరు 2021 (15:56 IST)

క్యాస్టింగ్ కౌచ్‌పై భూమికా చావ్లా..

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా క్యాస్టింగ్ కౌచ్‌పై హీరోయిన్ భూమిక స్పందించింది. ఎన్నో ఏళ్ల నుంచి తాను ఇండస్ట్రీలో వున్నానని.. తనను ఎప్పుడూ ఎవ‌రూ క‌మిట్మెంట్ అడ‌గ‌లేద‌ని భూమిక చెప్పుకొచ్చింది. తాను ఓ పాత్ర‌కు స‌రిపోతాన‌ని ద‌ర్శ‌కులు అనుకుంటే ముంబైకి వ‌చ్చి త‌న‌ను సంప్ర‌దించేవార‌ని క‌థ న‌చ్చితే సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేదానిన‌ని భూమిక వెల్ల‌డించింది.  
 
కాగా.. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొన‌సాగిన భూమిక ప్ర‌స్తుతం అక్క వదిన పాత్ర‌ల్లోనూ న‌టిస్తూ అల‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా తాజాగా భూమిక ఓ టీవీ ఇంట‌ర్య్వూలో ఆస‌క్తిక‌ర కామెంట్లు చేసింది. కాస్టింగ్ కౌచ్ గురించి భూమిక‌ను ప్ర‌శ్నించ‌గా క‌మిట్మెంట్ ఇస్తేనే ఆఫ‌ర్లు వ‌స్తాయ‌ని… నిర్మాత‌లతో ట‌చ్‌లో ఉంటేనే ఆఫ‌ర్లు వ‌స్తాయ‌నే వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని వ్యాఖ్యానించింది.