సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (16:24 IST)

ట్రోల్స్ చేసేవారికి కౌంటరిచ్చిన హారిక - గుడ్డలూడదీసి కొడతానంటూ వార్నింగ్

తన ఎత్తుపై, ఫోటో గురించి వివిధ రకాలైన కామెంట్స్ చేసే నెటిజన్లకు యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ నటి దేత్తడి హారిక గట్టి వార్నింగ్ ఇచ్చింది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ పలికిన ఓ డైలాగ్‌ను ఆమె షేర్ చేసింది. "ఎవడు పడితే వాడు బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి కొడతా. అలా పిలవాలంటే ఓ అర్హత ఉండాలి. లేదా నా అభిమాని అయి ఉండాలి" అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో హారిక షేర్ చేశారు. దీన్ని షేర్ చేయడం ద్వారా నెటిజన్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 
 
ఇదిలావుంటే, వెబ్ సిరీస్‌లతో పాటు షార్ ఫిలిమ్స్‌లలో అమితమైన క్రేజ్‌ను సొంతం చేసుకన్న హారిక.. తెలంగాణ యాసలో ఆమె పలికించే డైలాగులు, నటనకు ఎంతో మంది ప్రేక్షలు ఫిదా అయ్యారు. అలాగే బిగ్ బాస్ నాలుగో సీజన్‌ల ఫినాలే వరకు వెళఅలింది. పలు ప్రైవేట్ ఆల్బమ్స్‌ను చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఎత్తుపై నెటిజన్లు వివిధ రకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు.