1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 22 మే 2022 (13:45 IST)

మదురై కదిరేశన్ దంపతులకు హీరో ధనుష్ షాక్

dhanush
మదురై జిల్లా మేలూరుకు చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులకు హీరో ధనుష్, ఆయన తండ్రి కస్తూరీరాజాలు తేరుకోలేని షాకిచ్చారు. తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఆరోపణలు చేస్తూ, కోర్టులను ఆశ్రయిస్తూ, నోటీసులు పంపుతున్న కదిరేశన్ దంపతులు బహిరంగ క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో రూ.10 లక్షలకు పరువు నష్టం దావా వేస్తామని తాజాగా లీగల్ నోటీసులు పంపించారు. 
 
కాగా, హీరో ధనుష్ తమ కొడుకేనంటూ ఈ దంపతులు న్యాయపోరాటం చేస్తున్నారు. ఇందుకోసం వారు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో ధనుష్, ఆయన తండ్రి కస్తూరీరాజాలు నకిలీ ధృవీకరణ పత్రాలు సమర్పించారని పేర్కొంటూ ఆ దంపతులు మరోమారు నోటీసులు జారీచేశారు. వీటికి ధనుష్, ఆయన తండ్రిల తరపున అడ్వకేట్ నోటీసు జారీచేశారు. తమ క్లయింట్స్‌కు బహిరంగ క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో రూ.10 లక్షలకు పరువునష్టం దావా వేస్తామంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.