శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 సెప్టెంబరు 2023 (13:54 IST)

24 నవంబర్ 2023న వస్తోన్న ధ్రువ నక్షత్రం

Chian Vikram
తమిళ్ స్టార్ హీరో విక్రమ్ సినిమా ధ్రువ నక్షత్రం వచ్చేసింది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా రీతువర్మ, ఐశ్వర్య రాజేష్, రాధికా, సిమ్రాన్, అర్జున్ దాస్.. లాంటి పలువురు స్టార్స్‌తో స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ధ్రువ నక్షత్రం సినిమా 2017లోనే రిలీజ్ కావాల్సి ఉంది. 
 
కానీ ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఆరేళ్ల తర్వాత ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి ఓ సాంగ్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్ తాజాగా సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. 
 
సినిమాలోని యాక్షన్ సీన్స్‌తో ఓ ప్రోమోని రిలీజ్ చేసి ధ్రువ నక్షత్రం సినిమాని 24 నవంబర్ 2023న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.