శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 జూన్ 2024 (11:51 IST)

ఛత్రపతి శివాజీ మహారాజ్‌పై సినిమా.. ఔరంగజేబుగా రానా?

Rana Daggubati
బాలీవుడ్ దర్శకుడు అమిత్ రాయ్ తాజా సినిమా ఛత్రపతి శివాజీ మహారాజ్‌పై వుంటుంది. దిల్ రాజు వాకావో ఫిల్మ్స్ సహకారంతో నిర్మించిన ఈ చిత్రం 2024 చివరి నాటికి షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో ప్రతినాయకుడు చక్రవర్తి ఔరంగజేబ్ పాత్ర కోసం రానా దగ్గుబాటిని అమిత్ రాయ్, దిల్ రాజు పరిశీలిస్తున్నారు. 
 
బాహుబలిలో భల్లాలదేవగా తన ప్రభావవంతమైన నటనకు పేరుగాంచిన రానా, ఈ కీలక పాత్ర కోసం జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ విషయాలు ప్రస్తుతం చర్చల దశలో వున్నాయి. ఇందులో శివాజీ పాత్రకు షాహిద్ కపూర్ ఎంపికయ్యారు. ఇక ఔరంగజేబ్ పాత్రకు రానా ఓకే అయితే స్క్రీన్‌పై సూపర్ కాంబో ఆవిష్కృతమైనట్లేనని టాక్ వస్తోంది. 
 
ఈ సినిమా ఛత్రపతి శివాజీ మహారాజ్ చుట్టూనే సాగినప్పటికీ, ఇది బయోపిక్ కాదు. ఇది థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. దిల్ రాజు ఇటీవలి కాలంలో బాక్సాఫీస్ వద్ద గడ్డు దశను ఎదుర్కొన్నాడు. నిర్మాతగా ఆయన ఇటీవల తీసిన సినిమాలేవీ ఆయనకు ఉపశమనం కలిగించలేదు. అయితే శివాజీ సినిమా దిల్ రాజుకు హిట్ ఇస్తుందని టాక్ వస్తోంది.