బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 19 జనవరి 2017 (13:52 IST)

అక్కినేని ఫ్యామిలీ నుంచి మరో మల్టీస్టారర్ సినిమా.. మనంలా మరో హిట్ ఖాయమా?

అక్కినేని నాగేశ్వరరావు చివరి సినిమాగా తెరకెక్కిన సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్యలు కలిసి నటించారు. ఫ్యామిలీ మల్టీస్టారర్‌గా తెరకెక్కిన మనం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగ

అక్కినేని నాగేశ్వరరావు చివరి సినిమాగా తెరకెక్కిన సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్యలు కలిసి నటించారు. ఫ్యామిలీ మల్టీస్టారర్‌గా తెరకెక్కిన మనం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇదే ఫ్యామిలీ నుంచి ఓ మల్టీస్టారర్ సినిమా రెడీ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. దిల్ రాజు నిర్మాతగా శతమానం భవతి ఫేం సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. 
 
నాగార్జున, నాగచైతన్యలు హీరోలుగా నటించనున్న ఈ సినిమాకు ప్రస్తుతం కథ రెడీ చేసే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ప్రస్తుతం చైతూ-సమ్మూ, అఖిల్- శ్రేయాల వివాహ పనుల్లో అక్కినేని నాగార్జున బిజీగా ఉన్నారు. 
 
అలాగే ఓం నమో వేంకటేశాయ చిత్రం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. ఆపై రాజుగారి గది2లో నాగార్జున నటిస్తారు. చైతూ కూడా మరో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ పనులు పూర్తయ్యాక మనం సినిమా లాంటి మల్టీస్టారర్ సినిమా తెరకెక్కనుందని సమాచారం.