మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 20 మే 2022 (17:14 IST)

షికారులో రెండో పాట‌ను విడుద‌ల చేసిన దిల్ రాజు - జూన్ 24 చిత్రం విడుద‌ల‌

Dil Raju, Tej Kura Pati, P. R Kumar and others
Dil Raju, Tej Kura Pati, P. R Kumar and others
రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్ నేప‌థ్యంలో రూపొందుతోన్న చిత్రం `షికారు`. ఈ చిత్రంలో సాయి దన్సిక, తేజ్ కూర పాటి, అభినవ్ మేడిశెట్టి, ధీర‌జ్‌, న‌వ‌కాంత్ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తున్నారు. ఈ సినిమాకి స్టోరీ -స్క్రీన్ ప్లే -డైరెక్షన్ హరి కొలగాని వహించారు. నిర్మాత పి. ఎస్. ఆర్ కుమార్ (బాబ్జి,వైజాగ్ ) నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.
 
ఇటీవ‌లే ఈ చిత్రం నుంచి మొద‌టి సాంగ్ విడుద‌లై ఆద‌ర‌ణ పొందింది. బుధ‌వారంనాడు చిత్ర యూనిట్ రెండో పాట‌ను విడుద‌ల‌చేసింది. ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు కార్యాల‌యంలో  `ఫ్రెండే తోడుండగా` అనే రెండో సాంగ్‌ను దిల్‌రాజు విడుద‌ల చేశారు.
 
అనంత‌రం దిల్ రాజు మాట్లాడుతూ, షికారు సినిమాను మా బాబ్జీ నిర్మాత‌గా కొత్త ద‌ర్శ‌కుడిని ప‌రిచ‌యం చేస్తూ, కొత్త‌వారితో మూవీ పూర్తి చేశారు. ఇందులో న‌టించిన తేజ్ మా `రౌడీ బాయ్స్‌`లో న‌టించాడు. అప్పుడే ఈ సినిమా గురించి చెబుతుండేవాడు. బాగా వ‌చ్చింద‌నేవాడు. ముందుగా ఓ సాంగ్‌ను విడుద‌ల చేశారు. జనాల్లో బాగా రీచ్ అయింది. ఈరోజు రెండో పాట‌.. ప్రెండే తోడుగా వుండ‌గా లైఫే పండుగ‌..అనే పాట‌ను విడుద‌ల చేశాను. ఫ్రెండ్‌షిప్‌లోని మాధుర్యాన్ని బాగా తెర‌కెక్కించారు. ఇది యూత్‌కు బాగా రీచ్ అవుతుంద‌నే నమ్ముతున్నాను. బాబ్జీకి, చిత్ర‌యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌. ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేస్తే థియేట‌ర్‌కువ‌చ్చి సూపర్ హిట్ చేస్తార‌ని అన్నారు.
 
నిర్మాత బాబ్జీ మాట్లాడుతూ, ఎంతో బిజీగా వుండి కూడా మా షికారు సినిమాలోని రెండో పాట‌ను దిల్‌రాజు గారు ఆవిష్క‌రించ‌డం ఆనందంగా వుంది. అన్ని కార్య‌క్ర‌మాలు ముగించుకుని `షికారు` చిత్రాన్ని జూన్ 24న విడుద‌ల చేయ‌బోతున్నామ‌ని అన్నారు.