శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 అక్టోబరు 2021 (12:14 IST)

వారికి నచ్చిన ప్యానల్‌కి మద్దతిచ్చిన వారికే క్యారెక్టర్లు రాస్తారట : అజయ్ భూపతి

తెలుగు సినీ నటుల సంఘమై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ ఎన్నికలు సినీ నటుల మధ్య ఉన్న విభేదాలను బయటపెడుతున్నాయి. ఇవి సినీ పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి. 
 
సినీ ప్రముఖులు నిట్ట నిలువునా చీలిపోయారా అనే భావన కలుగుతోంది. ఏ మాత్రం నియంత్రణ లేకుండా ఎన్నికల్లో పోటీ పడుతున్న వారు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.
 
మరోవైపు ఒక ప్యానల్‌కు సపోర్ట్ చేసిన వారికి... ఆ ప్యానల్‌ను వ్యతిరేకించే వారు అవకాశాలు ఇవ్వకపోయే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. తాజాగా డైరెక్టర్ అజయ్ భూపతి చేసిన ట్వీట్ ఇదే విషయాన్ని సూచిస్తోంది.
 
''నాకు నచ్చిన ప్యానల్‌కి మద్దతిచ్చిన వారికే క్యారెక్టర్లు రాస్తానని ఇప్పుడు నాతో ఒక డైరెక్టర్ చెప్పాడు'' అంటూ అజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజంగా ఇలాంటి పరిణామాలే చోటుచేసుకుంటే సినీ పరిశ్రమ దెబ్బతినడం ఖాయమని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.