శనివారం, 30 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 మార్చి 2021 (09:45 IST)

చంద్రశేఖర్ యేలేటి పుట్టినరోజు.. ఓ కొత్తదారిలో ఆయన ''ప్రయాణం''

టాలీవుడ్ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మార్చి 4, 1973లో జన్మించారు. తెలుగులో ఉత్తమ జాతీయ చలన చిత్ర పురస్కారం పొందిన ఐతే సినిమా ద్వారా చిత్రరంగంలో ప్రవేశించారు. ఆయన అనుకోకుండా ఒక రోజు, ప్రయాణం వంటి విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించాడు.

ఇందుకోసం ఏపీ ప్రభుత్వ నంది అవార్డులు గెలుచుకున్నాడు. గుణ్ణం గంగరాజు దర్శకత్వం వహించిన తెలుగు చలన చిత్రం లిటిల్ సోల్జర్స్‌లో సహాయ దర్శకునిగా జీవితాన్ని ప్రారంభించాడు. బహుళ ప్రజాదరణ పొందిన హాస్య ధారావాహిక అయిన అమృతం మొదటి 10 ఎపిసోడ్లకు దర్శకత్వం వహించాడు.
 
అసిస్టెంటు డైరక్టరుగా పనిచేసిన తరువాత ఆయన ఐతే సినిమాతో దర్శకత్వ భాద్యతలు చేపట్టాడు. ఈ చిత్రం నిర్మాణానికి 1.5 కోట్ల ఖర్చయింది. కానీ ఈ చిత్రం 6 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. రెండు సంవత్సరాల తరువాత ఆయన అనుకోకుండా ఒక రోజు చిత్రాన్ని విదుదల చేసాడు.

ఈ రెండు చిత్రాలకు గున్నం గంగరాజు నిర్మాణ భాద్యతలు చేపట్టాడు. కొంత కాలం వ్యవధి తరువాత ఆయన గోపీచంద్ కథా నాయకునిగా ఒక్కడున్నాడు చిత్రానికి దర్శకత్వం వహించాడు. 2009లో ఆయన తన నాల్గవ చిత్రం మంచు మనోజ్ కథానాయకునిగా ప్రయాణం చిత్రానికి దర్శకత్వం వహించాడు. 
 
ఇలా ఏడు సినిమాలను తెరకెక్కించాడు. ఈ ఐదింటిలోనూ వైవిధ్యం చూపెట్టాడు. ప్రస్తుతం చెక్ అంటూ తెరముందుకు వచ్చాడు. నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి ఈ సినిమాను రూపొందించాడు.

ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇంకేముంది.. యేలేటి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు మరిన్ని సినీ అవకాశాలు వరించాలని ఆశిస్తూ.. శుభాకాంక్షలు తెలుపుదాం..