బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డివి
Last Updated : బుధవారం, 3 మార్చి 2021 (08:43 IST)

రానా త‌మ్ముడు హీరో అయిపోతున్నాడు!

Abiram daggupati
ద‌గ్గుబాటి రానా త‌మ్ముడు అభిరామ్ ఎప్ప‌టినుంచో హీరో కావాల‌నేది అత‌ని కోరిక‌. చాలా కాలంగా ప్ర‌య‌త్నాలు చేసినా ఇంకా న‌ట‌న‌పై పూర్తి ప‌ట్టులేద‌ని తండ్రి సురేష్‌బాబు వారించాడు. తాత రామానాయుడు బ‌తికుండ‌గానే సినిమాల షూటింగ్‌లో పాల్గొనేవాడు. ఒక్కోసారి హీరోయిన్లు స‌రిగ్గా చేయ‌క‌పోతే ఇలాకాదంటూ ఈయ‌నే ద‌ర్శ‌కుడిలా ఫీల‌యి కొన్ని సూచ‌న‌లు చేసేవాడు. పెద్ద నిర్మాత మ‌న‌వ‌డు కాబ‌ట్టి పెద్ద‌గా ప‌ట్టించుకొనేవారు కాదు. ఆ త‌ర్వాత శ్రీ‌రెడ్డి ఉదంతం తెలిసిందే. ఆమెను వ‌దిలించుకోవ‌డం కోసం అభిరామ్‌కు త‌ల‌మీద ప్రాణం తోక‌మీద‌కు వ‌చ్చింది.

ఇదిలా వుండ‌గా, గ‌త కొంత‌కాలంగా అభిరామ్ న‌ట‌న కోసం విదేశాల‌కు వెళ్ళి శిక్ష‌ణ పొంది వ‌చ్చాడు. ప్ర‌స్తుతం ఆయ‌న్ను ప్రేక్ష‌కులు గుర్తింపు పొందాలంటే ఏదో సినిమాలో ప‌రిచ‌యం చేయ‌డానికి స‌న్నాహాలు చేసిన‌ట్లు స‌మాచారం. వెంక‌టేష్ నార‌ప్ప‌, రానా విరాట‌ప‌ర్వం సినిమాల్లో అభిరామ్ త‌ళుక్కుమ‌ని మెరుస్తాడ‌ని వార్త‌లు మాత్రం వినిపిస్తున్నాయి.

ఒకేసారి హీరో కాకుండా కేరెక్ట‌ర్ ప‌రంగా చూపిస్తే బాగుంటుంద‌ని సురేష్‌బాబు ఆలోచ‌న‌. ఎట్ట‌కేల‌కు సురేష్‌బాబు స్నేహితుడు ర‌విబాబు తీయ‌బోయే సినిమాలో ప‌రి‌చ‌యం కానున్న‌ట్లు తెలుస్తోంది. అందులో హీరోగా కాకుండా క‌థ‌ను బేస్ ‌చేసుకునే ప్ర‌ధాన పాత్ర‌గా వుంటుంద‌ని తెలుస్తోంది. అల్ల‌రి సినిమా ద్వారా న‌రేశ్‌ను ప‌రిచ‌యం చేసిన‌ట్లే ఆ త‌ర‌హాలో అభిరామ్‌ను చేయ‌నున్నాడ‌ని ఫిలింన‌గ‌ర్ క‌థ‌నాలు చెబుతున్నాయి. త్వ‌ర‌లో మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి.