బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 జనవరి 2022 (11:34 IST)

ప్రముఖ దర్శకుడు పీసీ రెడ్డి కన్నుమూత

pc reddy
ప్రముఖ దర్శకుడు పీసీ రెడ్డి అనారోగ్యం కారణంగా మృతి చెందారు. సుమారు 75 చిత్రాలకు దర్శకత్వం వహించిన పీసీ రెడ్డి చెన్నైలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఈ రోజు ఉదయం 8.30 లకు చెన్నైలో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న పీసి రెడ్డి సోమవారం ప్రాణాలు కోల్పోయారు.

ఇకపోతే.. పి.సి.రెడ్డి పూర్తి పేరు పందిళ్లపల్లి చంద్రశేఖరరెడ్డి. 1933, అక్టోబర్ 15వ తేదీన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, అనుమసముద్రం గ్రామంలో జన్మించిన పీ సి రెడ్డి  పందిళ్లపల్లి నారపరెడ్డి, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు,
 
1959లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినీరంగ ప్రవేశం చేశారు.  వి.మధుసూధనరావు ఆదుర్తి సుబ్బారావు వద్ద సహాయ దర్శకుడిగా, సహ దర్శకుడిగా పని చేశారు. అనూరాధ అనే సినిమాకు మొదటి సారి దర్శకత్వం వహించారు. సూపర్ స్టార్ కృష్ణ తో 20 చిత్రాలు తెరకెక్కించడం విశేషం. పి.సి.రెడ్డి. ఆయన వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసిన బి.గోపాల్, ముత్యాల సుబ్బయ్య, పి.యన్.రామచంద్రరావు, శరత్, వై. నాగేశ్వరరావు వంటివారు దర్శకులుగా రాణించారు.