మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 16 ఆగస్టు 2022 (18:35 IST)

విజ‌య్ దేవ‌ర‌కొండ అన‌న్య‌పాండే చెవిలో ఏం చెప్పాడో తెలుసా!

vijay- ananya
vijay- ananya
పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్  ''లైగర్''(సాలా క్రాస్‌బ్రీడ్) ఆగస్ట్ 25న విడుదలౌతుంది. ది గ్రేట్ మైక్ టైసన్ లైగర్ సినిమాతో ఇండియన్ సినిమాలో అరంగేట్రం చేస్తున్నారు. పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.
 
చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా హైద‌రాబాద్ వ‌చ్చిన అన‌న్య‌పాండేకు ఓ ప్ర‌శ్న ఎదురైంది. తెలుగులో మోస్ట్ హ్యాండసమ్ యాక్టర్ ఎవరు ? అని అడిగితే.. ఆమె ఏదో చెప్ప‌బోతుండ‌గా.. వెంట‌నే ఆమె చెవిలో కొద్దిసేపు ఏదో చెప్పాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఆ త‌ర్వాత ఆమె మాట్లాడుతూ,  అల్లు అర్జున్ గారు. ఆయన చాలా కూల్. అల వైకుంఠపురంలో నాకు చాలా నచ్చింది అంటూ బ‌దులిచ్చింది. మ‌రి విజ‌య్ పేరు చెబుతుందేమోన‌ని త‌ను అలా చెప్పించాడ‌ని తెలుస్తోంది.