శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 12 జూన్ 2017 (09:14 IST)

జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణ రెడ్డి ఇకలేరు... సినీలోకం దిగ్భ్రాంతి

జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణ రెడ్డి ఇకలేరు. ఆయన సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస వ

జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణ రెడ్డి ఇకలేరు. ఆయన సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన తన కలంపేరు 'నినారే'తో తెలుగు పాఠక, సినీ ప్రేక్షక లోకానికి సుపరిచితులు. 
 
ఆయన 1931 జూలై 29న కరీంనగర్ జిల్లా హనుమాజీపేటలో రైతు దంపతులు మల్లారెడ్డి, బుచ్చమ్మలకు ఆయన జన్మించారు. ఆయనది బాల్య వివాహం కాగా, సతీమణి పేరు సుశీల. సినారేకు నలుగురు కుమార్తెలు గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి ఉన్నారు. ఈయన 1962లో తొలిసారి సినీరంగ ప్రవేశం చేశారు.
 
ఆయన రచించిన "విశ్వంభర కావ్యా"నికి గాను 1988లో ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం ఆయన్ను వరించింది. 1977లో ఆయన భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని పొందారు. సినారే మృతిచెందడంపై సినీ పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. 

తెలుగు చలన చిత్ర రంగంలో సినారె పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. సినారె రాసిన పాటలు ఇప్పటికీ జనాలనోళ్లలో నానుతున్నాయి. ‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని’ వంటి పాటలు సగటు ప్రేక్షకుడి మదిని దోచుకున్నాయి. సినారె సాహితీ ప్రతిభకు గుర్తింపుగా 1997లో రాజ్యసభ సభ్యునిగా నామినేట్ అయ్యారు.