శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 10 జూన్ 2019 (13:23 IST)

ఎక్స్‌ట్రా జబర్దస్త్‌.. చంద్ర మల్లెపూల స్కిట్.. రోజా, రష్మిల డ్యాన్స్‌తో అదుర్స్ (వీడియో)

ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లోని జూన్ ఏడో తేదీ శుక్రవారం నాటి షో అదిరిపోయింది. ఈ షోకు అలేగ్రా సాంగ్‌తో యాంకర్ రష్మీ చేసిన డ్యాన్స్ రచ్చ రచ్చగా నిలిచింది. ఈ షోకు సంబంధించిన హైలైట్స్ గురించి ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చ సాగుతోంది.  
 
అలాగే మెగాస్టార్ చిరంజీవి కొండవీటి దొంగ చిత్రంలోని పాపులర్ ఎవర్‌గ్రీన్ సాంగ్‌లో చ‌మ‌కు చ‌మ‌కు ఛాం పాటతో జబర్దస్త్ జ‌డ్జ్ రోజా ఎంట్రీ ఇవ్వడం సూపర్ అనిపించిందని.. నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 
 
పాటకు తగ్గట్టుగా అదిరిపోయే స్టెప్పులు వేస్తూ అభినయంతో రోజా ఆకట్టుకున్నారని కితాబిస్తున్నారు. ఈ పాటకు యాంకర్ రష్మీ కూడా తోడు కావడంతో జబర్దస్త్ స్టేజ్‌ని షేక్ చేశారు. 
 
మ‌రో జ‌డ్జ్‌గా ఆలీ సింపుల్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఇక చమ్మక్ చంద్ర మల్లెపూల స్కిట్ గురించి అతను పేల్చే డైలాగులు సూపర్బ్ అనిపించిందని.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.  
  
మొత్తం ఈషోలోని పార్టిసిపెంట్స్ స్కోర్స్ విష‌యానికి వ‌స్తే.. అన్ని టీమ్స్‌కి 9 పాయింట్లు రాగా.. చ‌మ్మ‌క చంద్ర ''మల్లెపూలు'' స్కిట్ పది పాయింట్లు గెలుచుకున్నారు.