సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (18:22 IST)

''జబర్దస్త్''కి వచ్చేసిన రోజా.. నాగబాబు ఎంట్రీ ఇస్తారా? ప్రోమో చూడండి..(video)

బుల్లితెరపై బాగా పాపులర్ అయిన తెలుగు షోలలో జబర్దస్త్ ఒకటి. ఈ కామెడీ షోకు ఏళ్ల తరబడి విశేష ఆదరణ లభిస్తోంది. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది, చమ్మక్ చంద్రలాంటి నటులంతా జబర్దస్త్ వల్లే పాపులర్ అయ్యారు. 
 
ఇదిలా ఉండగా జబర్దస్త్ ఆరంభం నుంచి జడ్జీలుగా సీనియర్ హీరోయిన్ రోజా, మెగా బ్రదర్ నాగబాబు తమదైన ముద్ర వేస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రోజా, నాగబాబు జబర్దస్త్‌కు తాత్కాలికంగా దూరమైన సంగతి తెలిసిందే. వీరి స్థానంలో శేఖర్ మాస్టర్, మీనా ఈ కార్యక్రమంలో కనిపించారు. 
 
వీరిద్దరి రాకతో.. రోజా, నాగబాబు ఈ కార్యక్రమంలో కనిపించకపోవచ్చునని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో జబర్దస్త్‌కి రోజా తిరిగొచ్చేసింది. ఈ వారం ప్రసారం కానున్న ఎపిసోడ్ ప్రోమోలో రోజా కనిపించింది. ఇక తాను ఎన్నికల్లో గెలిచి ఎంపీ అయినా, 'జబర్దస్త్' ను వదులుకునేది లేదని ఇటీవల నాగబాబు కూడా ప్రకటించారు. త్వరలో ఆయన కూడా జబర్దస్త్‌లో కనిపిస్తారని టాక్ వస్తోంది. ఇక ఈ ప్రోమోలో జబర్దస్త్ జడ్జిలుగా మీనా, రోజా కనిపిస్తారు. మీరూ ప్రోమోను ఓ లుక్కేయండి.