''నేను లోకల్'' నానికి ప్రమోషన్ రానుంది.. 4 నెలల్లో తండ్రి కాబోతున్నాడట..
నేను లోకల్ అంటూ సినిమా ద్వారా తెరపైకి వస్తున్న నానికి ప్రమోషన్ రానుంది. 2012 అక్టోబర్ 27న అంజనాతో నాని ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. వీరి వివాహం వైజాగ్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఇక త్రినాథ రావు దర్శకత
నేను లోకల్ అంటూ సినిమా ద్వారా తెరపైకి వస్తున్న నానికి ప్రమోషన్ రానుంది. 2012 అక్టోబర్ 27న అంజనాతో నాని ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. వీరి వివాహం వైజాగ్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఇక త్రినాథ రావు దర్శకత్వంలో నాని నేను లోకల్ అనే చిత్రాన్ని చేయగా ఈ మూవీ ఫిబ్రవరి 3న విడుదల కానుంది.
ప్రస్తుతం టాలీవుడ్ హీరోలందరూ నచ్చిన వారితో ఏడు అడుగులు వేసి మూడు ముళ్ళ వివాహ బంధంలోకి అడుగుపెట్టేశారు. అయితే ఈ మధ్య.. పెళ్ళిళైన హీరోలకు ప్రమోషన్ వచ్చేస్తోంది. ఆది, అల్లరి నరేష్, బన్నీ ఇలా ఈ హీరోలు తండ్రిగా ప్రమోషన్ అందుకొని తెగ మురిసిపోతున్నారు.
ఇదే విధంగా నేచురల్ స్టార్ నానికి తండ్రి హోదా పొందే అవకాశం దగ్గరలోనే ఉంది. ఈ విషయాన్ని నేను లోకల్ చిత్ర ప్రమోషన్‌లో వెల్లడించాడు నాని. మరో నాలుగు నెలలో తాను తండ్రి కాబోతున్నట్టు చెప్పిన నాని, తండ్రి అవుతున్నప్పటికీ నేను ఇంకా చిన్న పిల్లాడినే అని అంటున్నాడు.