బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (15:42 IST)

అయ్యబాబోయ్... నేను బతికే ఉన్నా.. సీనియర్ నటి ఫరీదా జలాల్ ట్వీట్

తాను చనిపోయినట్టు సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తకు బాలీవుడ్ నటి ఫరీదా జలాల్ స్వయంగా ఫుల్‌స్టాఫ్ పెట్టారు. తాను జీవించే ఉన్నట్టు ప్రకటించారు. అలాంటి పుకార్లను ఎందుకు ప్రచారం చేస్తారో తనకు అర్థం కావడంల

తాను చనిపోయినట్టు సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తకు బాలీవుడ్ నటి ఫరీదా జలాల్ స్వయంగా ఫుల్‌స్టాఫ్ పెట్టారు. తాను జీవించే ఉన్నట్టు ప్రకటించారు. అలాంటి పుకార్లను ఎందుకు ప్రచారం చేస్తారో తనకు అర్థం కావడంలేదని 67 ఏళ్ల ఈ సీనియర్ నటి ఆవేదన వ్యక్తంచేశారు. పైగా, తాను సంపూర్ణ ఆరోగ్యంతో, సంతోషంగా ఉన్నట్టు తెలిపారు. 
 
''ఏమాత్రం ఆధారం లేని ఈ పుకార్లు ఎక్కడి నుంచి వస్తాయో నాకు తెలియదు. వాటిని విని గట్టిగా నవ్వుకున్నాను.. అయితే నా ఇంట్లో ఫోన్లు మాత్రం అస్తమానం మోగుతూనే ఉన్నాయి. అందరూ అదే ప్రశ్న అడుగుతున్నారు. దీంతో కొంత చిరాగ్గా ఉంది'' అని ఆమె అన్నారు. త్వరలో రాబోతున్న ఇమ్రాన్ ఖాన్ సినిమా ''సర్గోషియాన్''లో ఆమె మరోసారి కశ్మీరీ మహిళగా ఆమె కనిపించనున్నారు.