శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 డిశెంబరు 2021 (17:26 IST)

వరంగల్‌లోని థియేటర్‌లో అగ్నిప్రమాదం-అఖండ సినిమా చూస్తుండగా..

వరంగల్‌లోని థియేటర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రేక్షకులు మూవీ చూస్తుండగా...ఒక్కసారిగా థియేటర్ లో పొగలు అలుముకున్నాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రేక్షకులు బయటకు పరుగులు తీశారు. 
 
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే థియేటర్‌లో మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. 
 
నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం 'అఖండ' గురువారం రిలీజైన సంగతి తెలిసిందే. బాలయ్య-బోయపాటి కాంబో కావడంతో ఈ సినిమా సూపర్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇందులో ప్రగ్యాజైశ్వాల్, శ్రీకాంత్, జగపతిబాబు తదితరులు కీలకపాత్రలు చేశారు. 
 
తెలుగు రాష్ట్రాల్లో ధియేటర్లన్నీ బాలయ్య అభిమానులతో నిండిపోయాయి. ఈ క్రమంలో అఖండ సినిమా ప్రదర్శిస్తున్న వరంగల్ లోని జెమిని థియేటర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.