శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 మే 2022 (10:37 IST)

జగిత్యాల్ రాజారాంపల్లిలో తొలి ఇగ్లూ సినిమా థియేటర్

igloo theater
సాధారణంగా వినోదం కోసం ప్రతి ఒక్కరూ తరచుగా పార్కులు, సినిమా థియేటర్లు, పర్యాటక ప్రాంతాలకు వెళుతుంటారు. అయితే, ఇటీవలి కాలంలో సినిమా రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇందులోభాగంగా, మల్టీప్లెక్స్‌లు వచ్చాయి. ఇవి నగరాలు, పట్టణ ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిలో అనేక లగ్జరీ సదుపాయులు ఉన్నాయి. అయితే, గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ తరహా మల్టీప్లెక్స్‌లకు వెళ్లాలంటే సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. 
 
ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని, గ్రామీణ ప్రజలకు వినోదం అందించేందుకు తెలంగాణ రాష్ట్రంలో తొలి ఇగ్లూ థియేటర్‌ను కొందరు స్నేహితులు సిద్ధమయ్యారు. ఫలితంగా జగిత్యాల జిల్లా రాజారాంపల్లిలో తొలి థియేటర్ రానుంది. ఈ కాన్సెప్ట్ ముంబైలోని చోటూ మహారాజ్ ఇగ్లూ సినిమా థియేటర్ నుండి ప్రేరణపొందారు. ఇది ఎస్కిమోలు సృష్టించిన ఇగ్లూ హౌస్‌ల మాదిరిగానే ఉంటుంది. ఇందులో అధిక నాణ్యత సౌకర్యాలతో 100 సీట్లు కలిగి ఉంటుంది. ఈ ఇగ్లూ థియేటర్‌ను నెల రోజుల్లో ప్రారంభించే అవకాశం ఉంది.