1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 జూన్ 2021 (10:01 IST)

దంచికొట్టిన వర్షం ... ఆ జిల్లాలో 13 సెం.మీ వర్షంపాతం

తెలంగాణ రాష్ట్రంలో వర్షం దంచికొట్టింది. ముఖ్యంగా, ఆదివారం రాత్రి సిరిసిల్ల జిల్లాలో ఏకంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ జిల్లాతో పాటు.. జగిత్యాల, ఆదిలాబాద్‌, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ 10 సెంటీమీటర్లకుపైగా వర్షాపాతం నమోదైంది. 
 
సోమవారం ఉదయం 7 గంటల వరకు అత్యధికంగా సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో 13.7 సెంటీ మీటర్ల వర్షాపాతం నమోదైంది. ఆ తర్వాత జగిత్యాల జిల్లా జెగ్గాసాగర్‌లో 12.9 సెంటీమీటర్ల వాన కురిసింది. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో 12.5 సె.మీ, చందుర్తి మండలం మర్రిగడ్డలో 11.5 సె.మీ, పెద్దూరులో 11.28 సె.మీ, ఆవునూరులో 11.15 సె.మీ వర్షాపాతం నమోదైంది.
 
అలాగే, ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండలో 11.3 సె.మీ, జగిత్యాల మెట్‌పల్లిలో 11.2, గోధూరులో 10.95 సె.మీ, కోరుట్లలో 10.43 సె.మీ, నిజామాబాద్‌ జిల్లా చీమన్‌పల్లిలో 11.18 సె.మీ, లక్ష్మాపూర్‌లో 10.85 సె.మీ, సిద్దిపేట జిల్లా రాఘవాపూర్‌లో 10.98 సె.మీ, జిల్లా కేంద్రంలో 10.10 సె.మీ, కరీంనగర్‌ జిల్లా పోచంపల్లిలో 10.98 సె.మీ, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో 10.58 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది.