శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 16 మే 2023 (17:40 IST)

అడివి శేష్‌ ను అభినందించిన భారత మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్

Shri Ram Nath Kovind, Adivi Sesh
Shri Ram Nath Kovind, Adivi Sesh
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ టైటిల్ పాత్రలో అడివి శేష్ నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ 'మేజర్' హ్యూజ్  బ్లాక్ బస్టర్ కావడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆర్మీ సిబ్బంది, రాజకీయ నాయకులు, సినీ ప్రేక్షకులు తదితర అన్ని వర్గాల ప్రజలను ఈ చిత్రం ఆకట్టుకుంది.
 
ఇదిలావుండగా హీరో అడివి శేష్, భారత మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ జీ నుంచి ఆహ్వానం అందుకున్నారు. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్‌ ను రూపొందించినందుకు అడివి శేష్‌ ని అభినందించారు శ్రీ రామ్ నాథ్ కోవింద్. సినిమా అపూర్వ విజయం సాధించినందుకు అభినందించి, ఆశీర్వదించారు. ఇది మేకర్స్‌ కి అతిపెద్ద విజయం, గర్వకారణమైన క్షణం.
 
మేజర్ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. జీయంబీ ఎంటర్‌ టైన్‌ మెంట్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ , A+S మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.  మేజర్‌ లో శాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి , మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు.