బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024 (12:07 IST)

విజయ్ సినిమాలో విజయకాంత్.. ఎలా సాధ్యం?

vijayakanth
దివంగత విజయ్ కాంత్ మళ్లీ తెరపై కనిపించనున్నారు. తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న గొప్ప నటుడు విజయ్ కాంత్. కెప్టెన్‌గా ఆయనను ఇప్పటికే సినిమా జనాలు స్మరించుకుంటూ ఉంటారు. అంతలా తన పాత్రలు, నటనతో మెప్పించారాయన. 
 
ఇటీవల తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన ఆయన కోసం ‘ది గోట్‌’ సినిమా బృందం ఓ ఆసక్తికర పని చేయబోతోంది. ఆయనను మరోసారి వెండితెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నారని టాక్‌. ఇంకా ది గోట్‌లో విజయ్‌ కాంత్‌ అతిథి పాత్రలో కనిపిస్తారట. 
 
ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాలో విజయ్ రెండు పాత్రల్లో కనిపిస్తాడట. డీఏజింగ్ టెక్నాలజీతో ఓ పాత్రను కుర్రాడిగా మలుస్తారు. ఇటీవల విడుదలైన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం సినిమా రెండో షెడ్యూల్ చిత్రీకరణ చేస్తున్నారు