శుక్రవారం, 12 జులై 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024 (11:38 IST)

ఆ టూర్ వరకు టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ కొనసాగుతారు...

భారత క్రికెట్ జట్టు కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ కొనసాగుతున్నారు. ఈ కాంట్రాక్టు కాలం ముగిసిపోయింది. గత యేడాది వన్డే ప్రపంచ కప్ తర్వాత ముగిసింది. కానీ, ఆయన టీమిండియా కోచ్‌గా కొనసాగుతున్నారు. దీనిపై బీసీసీఐ కార్యదర్శి జై షా వివరణ ఇచ్చారు. జూన్ నెలలో జరుగనున్న టీ20 ప్రపంచ కప్ వరకు ద్రవిడ్ కొనసాగుతాని చెప్పారు. 
 
గత యేడాది ప్రపంచ కప్ తర్వాత ద్రవిడ్, సపోర్టు స్టాఫ్ కాంట్రాక్ట్ ముగిసినప్పటికీ డిసెంబరు - జనవరిలో జరగనున్న సౌతాఫ్రికా టూర్ వరకు కొనసాగాలని బీసీసీఐ కోరింది. అయితే, అది ఎంతకాలం అన్నది మాత్రం అప్పుడు చెప్పలేదు. ద్రవిడ్‌తో తాను మాట్లాడానని వెస్టిండీస్ - అమెరికాలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ వరకు కొనసాగాలని కోరినట్టు జై షా నిన్న వెల్లడించారు. ప్రపంచ కప్ తర్వాత ద్రవిడ్ వెంటనే సౌతాఫ్రికా టూర్‌కు వెళ్లడంతో అపుడు మాట్లాడటం కుదరలేదని, అదిప్పుడు జరిగిందని తెలిపారు. 
 
"రాహుల్ ద్రవిడ్ వంటి సీనియర్ కాంట్రాక్ట్ గురించి మీరెందుకు చింతిస్తున్నారు. టీ20 ప్రపంచ కప్ వరకు రాహుల్ భాయ్ కోచ్‌గా ఉంటారు" అని షా నొక్కి చెప్పారు. 'సమయం దొరికినపుడు రాహుల్‌తో మాట్లాడుతా. ప్రస్తుతం వరుస సిరీస్‌లతో బిజీగా ఉన్నాడు. అపుడేమో సౌతాఫ్రికా టూర్, ఆ వెంటనే స్వదేశంతో ఆప్ఘనిస్థాన్‌తో సిరీస్ ఇంగ్లండ్‌‍తో టెస్ట్ సిరీస్. ఈ నేపథ్యంలో అతడితో మాట్లాడటం కుదరలేదు' అని షా చెప్పుకొచ్చారు.