గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 4 జులై 2018 (17:21 IST)

గూఢచారి ట్రైలర్ ఎలా వుందంటే?

అడవి శేష్ హీరోగా ''గూఢచారి'' సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా టీజర్ సినీ ఫ్యాన్స్ మధ్య ఆసక్తి రేపుతోంది. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ ఈ

అడవి శేష్ హీరోగా ''గూఢచారి'' సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా టీజర్ సినీ ఫ్యాన్స్ మధ్య ఆసక్తి రేపుతోంది. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ ఈ టీజర్‌ను కట్ చేశారు. యాక్షన్, ఎమోషన్, రొమాన్స్‌ను ఈ టీజర్‌ చూసేయవచ్చు. ఈ చిత్రంలో అడివి శేష్ సరసన కథానాయికగా శోభిత ధూళిపాళ నటించింది. 
 
అభిషేక్ పిక్చర్స్, విస్టా డ్రీమ్ మర్చంట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్‌లో హై టెక్నికల్ వేల్యూస్‌ వున్నాయని చూడగానే అర్థమైపోతుంది. ఈ సినిమా ద్వారా సుప్రియ యార్లగడ్డ ఆర్టిస్టుగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఓ కీలకమైన పాత్రలో ప్రకాశ్ రాజ్ కనిపించనున్నాడు. ఆగస్టు 3వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా టీజర్‌ను ఓ లుక్కేయండి.