శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 23 మార్చి 2018 (13:51 IST)

శివాని సినిమాకు ముహూర్తం రెడీ.. ఎప్పుడంటే?

మెగా ఫ్యామిలీ నుంచి మెగా హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా టాలీవుడ్ యాంగ్రీ మ్యాన్, గరుడ వేగ యాక్టర్ రాజశేఖర్ కుమార్తె వెండితెరపై కనిపించనుంది. హిందీలో హిట్ కొట్టిన ''2 స్టేట్స్'' స

మెగా ఫ్యామిలీ నుంచి మెగా హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా టాలీవుడ్ యాంగ్రీ మ్యాన్, గరుడ వేగ యాక్టర్ రాజశేఖర్ కుమార్తె వెండితెరపై కనిపించనుంది. హిందీలో హిట్ కొట్టిన ''2 స్టేట్స్'' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం శివానిని ఎంపికైంది. అడివి శేష్ కీలక రోల్‌ చేసే ఈ సినిమా ద్వారా వెంకట్ కుంచ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. 
 
హైదరాబాద్.. అన్నపూర్ణ స్టూడియోలో శనివారం ఈ సినిమా లాంఛ్ కార్యక్రమం వుంటుందని తెలుస్తోంది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాలో శివాని తల్లి పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ నటిస్తోంది. ఈ ఏడాది ఈ సినిమాను విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.