శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 23 జనవరి 2018 (16:32 IST)

శివానీ అరంగేట్రం ఖరారైంది.. అడవిశేష్‌తో రొమాన్స్..

గరుడ వేగ నటుడు, యాంగ్రీమెన్ డాక్టర్ రాజశేఖర్‌, నటి జీవిత దంపతుల కుమార్తె శివాని తెరంగేట్రం చేయనుంది. కొద్ది రోజులుగా శివాని నటించనుందని వినిపిస్తోంది. ప్రస్తుతం అది నిజం కానుంది. తల్లితండ్రులు ఇద్దరూ

గరుడ వేగ నటుడు, యాంగ్రీమెన్ డాక్టర్ రాజశేఖర్‌, నటి జీవిత దంపతుల కుమార్తె శివాని తెరంగేట్రం చేయనుంది. కొద్ది రోజులుగా శివాని నటించనుందని వినిపిస్తోంది. ప్రస్తుతం అది నిజం కానుంది. తల్లితండ్రులు ఇద్దరూ నటులే కావడంతో కుమార్తెను హీరోయిన్‌గా వెండితెరపై తెచ్చేందుకు  ప్రోత్సహిస్తున్నారు.
 
ఇప్పటికే శివాని మెడిసిన్‌ చదువుతోంది. డాన్స్‌, మార్షల్‌ ఆర్ట్స్‌లో ఇప్పటికే శిక్షణ తీసుకుంది. ఇటీవల అమ్మడి ఫోటో షూట్ ఇమేజ్‌లు వైరల్ అయ్యాయి. ఇక తాజాగా బాలీవుడ్‌లో అలియా భ‌ట్‌ నటించిన ''2 స్టేట్స్‌'' సినిమా తెలుగు రీమేక్‌తో శివానీ ఎంట్రీ ఇవ్వ‌నుంది. అడ‌వి శేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
 
ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ మొదలుపెడుతున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియాలో వెల్లడించింది. లక్ష్య ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ  సినిమాకి అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూరుస్తున్నాడు.