ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 22 జనవరి 2018 (17:02 IST)

ఇద్దరూ వదిలేశారు.. ఇదే లక్ష్మీపార్వతి పరిస్థితి : కేతిరెడ్డి (వీడియో)

దేశంలో తెలుగు భాషను రెండో అధికార భాషగా ప్రకటించాలని సినీ నిర్మాత, తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో భాగంగా తెలుగు యువశక్తి ఆధ్వర్

దేశంలో తెలుగు భాషను రెండో అధికార భాషగా ప్రకటించాలని సినీ నిర్మాత, తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో భాగంగా తెలుగు యువశక్తి ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా వివిధ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులోభాగంగా చివరి రోజైన ఆదివారం తమిళనాడు, తిరుత్తణిలో ఉన్న ప్రసిద్ధ మురుగన్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయించారు. 
 
ఈ సందర్భంగా ఆయన తెలుగు భాషను రెండో అధికార భాషగా ప్రకటించాలని ఆయన కోరారు. ఇందుకోసం దేశంలో రెండో ప్రథమ పౌరుడిగా ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తగిన చర్యలు తీసుకోవాలని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయన పూర్తి ప్రసంగం కోసం ఈ వీడియోను చూడండి.