రీల్ హీరో కాదు.. రియల్ హీరో... రైతుబంధు.. ఎవరు?
సాధారణంగా చాలా మంది కథానాయకులు వెండితెరపైనే హీరోలుగా కనిపిస్తుంటారు. కానీ, నిజజీవితంలోకి వచ్చేసరికి వారిలోని శాడిజాన్ని చూపిస్తుంటారు. కానీ, కొంతమంది హీరోలు వెండితెరపైనేకాకుండా నిజ జీవితంలోనూ హీరోలుగా
సాధారణంగా చాలా మంది కథానాయకులు వెండితెరపైనే హీరోలుగా కనిపిస్తుంటారు. కానీ, నిజజీవితంలోకి వచ్చేసరికి వారిలోని శాడిజాన్ని చూపిస్తుంటారు. కానీ, కొంతమంది హీరోలు వెండితెరపైనేకాకుండా నిజ జీవితంలోనూ హీరోలుగా ఉంటారు. ఇలాంటి వారిలో తమిళ హీరో విశాల్ ఒకరు.
నుటుడిగా, నిర్మాతగా, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా, తమిళ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడుగా, సామాజిక కార్యకర్తగా ఇలా అన్ని రంగాల్లో తనదైనశైలిని ప్రదర్శిస్తున్నాడు. విశాల్ తాజా చిత్రం "అభిమన్యుడు". ఈ చిత్రం గత వారం విడుదలై మంచి టాక్‌తో ప్రదర్శించబడుతోంది.
పైగా, విశాల్ గత సినిమాలకు లేనంతగా ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లు సాధిస్తోంది. మొదటి వారాంతానికి ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.12 కోట్లు కొల్లగొట్టింది. రెండో వారంలో కూడా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది.
అయితే తాజాగా విశాల్ ఓ నిర్ణయాన్ని ప్రకటించి రియల్ హీరో అనిపించుకున్నారు. సినిమా సాధించిన వసూళ్లలో లాభాలను రైతులకు పంచాలని విశాల్ నిర్ణయించారు. టికెట్‌పై ఒక్కొ రూపాయి చొప్పున రైతులకు అందివ్వనున్నట్లు ప్రకటించారు.
గతంలో విశాలో తమిళనాట కూడా ఇదేవిధంగా ప్రకటించి రైతులకు తన వంతు సహాయాన్ని చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడ తన సినిమా లాభాల్లో వాటా ఇవ్వబోతున్నానని ప్రకటించడంతో విశాల్‌కు పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు.