మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: సోమవారం, 14 మే 2018 (18:08 IST)

విశాల్‌కి విల‌న్ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ - కోలీవుడ్‌లో హాట్ టాపిక్..!

అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోను మంచి క్రేజ్ ఉన్న హీరో విశాల్. మాస్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకునే ఆయన తన సినిమాలకి కథలను ఎంచుకుంటూ ఉంటాడు. తాజాగా విశాల్ 'ఇరుంబు తిరైస‌తో స‌క్సస్ సాధించాడు. ఈ సినిమా తరువాత ఆయన 'సండైకోళి 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు

అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోను మంచి క్రేజ్ ఉన్న హీరో విశాల్. మాస్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకునే ఆయన తన సినిమాలకి కథలను ఎంచుకుంటూ ఉంటాడు. తాజాగా విశాల్ 'ఇరుంబు తిరైస‌తో స‌క్సస్ సాధించాడు. ఈ సినిమా తరువాత ఆయన 'సండైకోళి 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఎందుకంటే.. సండైకోళి సినిమా విశాల్ కెరీర్‌లో మ‌ర‌చిపోలేని సినిమా. ఈ సినిమానే తెలుగులో పందెం కోడి టైటిల్‌తో అనువాద‌మై ఘ‌న విజయం సాధించింది. 
 
సండైకోళి సినిమాకి సీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్‌ కథానాయికగా నటిస్తుంది. అయితే... లేడీ విలన్ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు. 
 
'పొగరు' సినిమాలో శ్రియారెడ్డి పాత్రను గుర్తుకు తెచ్చేలా వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర ఉంటుందని అంటున్నారు. గతంలో విశాల్.. వరలక్ష్మి శరత్ కుమార్ మధ్య ప్రేమాయణం కొనసాగిన విషయం కోలీవుడ్లో అందరికీ తెలిసిందే. ఆ త‌ర్వాత వీరిద్ద‌రి మ‌ధ్య బ్రేక‌ప్ అయ్యిందంటూ కూడా ప్ర‌చారం జ‌రిగింది. అందువలన ఈ ఇద్దరి కాంబినేషన్లో వ‌స్తోన్న‌ ఈ సినిమా అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మ‌రి.. ఈ సినిమా విశాల్‌కి ఎలాంటి విజ‌యాన్ని అందిస్తుందో చూడాలి.