నరేంద్ర మోదీని, పళని స్వామిని అదొక్కటే అడుగుతున్నా... 'అభిమన్యుడు' విశాల్
మాస్ హీరో విశాల్ కథానాయకుడిగా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఇరుంబుతెరై'. ఇటీవల తమిళనాడులో విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ చిత్రాన్ని 'అభిమన్యుడు' పేరుతో ఎం.పు
మాస్ హీరో విశాల్ కథానాయకుడిగా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఇరుంబుతెరై'. ఇటీవల తమిళనాడులో విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ చిత్రాన్ని 'అభిమన్యుడు' పేరుతో ఎం.పురుషోత్తమన్ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. జూన్ 1న 'అభిమన్యుడు' చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ... తమిళంలో ఇరుంబు తిరై పేరుతో విడుదలైన ఈ చిత్రం నా కెరీర్‌లోనే పెద్ద సక్సెస్‌గా నిలిచింది. ఈ సినిమాను అభిమన్యుడుగా తెలుగులో విడుదల చేస్తున్నాం. చాలా సంవత్సరాలు తర్వాత రివ్యూస్ పరంగా, కలెక్షన్స్ పరంగా నాకు శాటిస్‌ఫ్యాక్షన్ ఇచ్చిన చిత్రం. తమిళనాడులో విడుదల చేసినప్పుడు సినిమాకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి. రెండు షోలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. ఎగైనెస్ట్ డిజిటల్ ఇండియా, ఎగైనెస్ట్ ఆధార్ కార్డ్ అని సినిమాకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారు. కానీ పోలీసులు మాకెంతో సపోర్ట్ చేశారు. సినిమా రిలీజైన తర్వాత ప్రేక్షకులకు నచ్చడంతో అన్నీ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయి.
ఈ సినిమాలో చూడబోయే విషయాలు షాకింగ్‌గా ఉంటాయి. ఏటీంలో జరిగే మోసాలు, బ్యాంకు లోన్స్ తీసుకోవడంలో ఇబ్బందులు, మిలటరీ ఆఫీసర్‌కి పాస్‌బుక్ లేదు అనే విషయం... మన ఫేస్‌బుక్‌లో అన్నీ విషయాలను ఓపెన్‌గా చెప్పేస్తున్నాం. అవన్నీ మనకు భవిష్యత్‌లో ఇబ్బందులను కలిగించేవే. ఈ సినిమాలో అర్జున్‌గారు వైట్ డెవిల్ అనే పాత్రలో కనిపిస్తారు. ఆయన దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. ఆ సమయంలో ఆయన నన్ను ఇన్‌స్పైర్ చేసి ఎంకరేజ్ చేశారు. సమాజంలో జరుగుతున్న విషయాలను ధైర్యంగా సినిమా రూపంలో మిత్రన్ డైరెక్ట్ చేశాడు. మంచి సినిమా ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు.
భవిష్యత్‌లో మన చుట్టు ఉన్న పరిస్థితుల పట్ల జాగ్రత్తగా ఉండాలనిపిస్తుంది. సమాజంలో జరిగే విషయాలను చెప్పడానికి మాకు బాధ్యత ఉంది. ప్రేక్షకులకు నిజాలను చెప్పడానికి సినిమా అనే మీడియాని ఉపయోగించుకోవడంలో తప్పులేదు. ఆధార్ కార్డ్, డిజిటల్ ఇండియా వల్ల ప్రజలు ఫేస్ చేయబోయే పరిస్థితులను ఇందులో చూపించబోతున్నాం. అలాగని నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా సినిమా చేయలేదు. ఆధార్ కార్డును బ్యాంక్ అకౌంట్‌కు లింక్ చేయాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు కూడా తీర్పు చెప్పింది. ఇంత స్ట్రాంగ్ కంటెట్‌ను ఇంత ధైర్యంగా ఎలా చెప్పారని చాలామంది అడిగారు. ఇలాంటి విషయాలను చెప్పడానికి ధైర్యం అవసరం లేదు. బాధ్యత ఉంటే చాలు అని చెప్పాం.
ఇది వేదిక కాకపోయినా ఓ ఓటర్‌గా, పౌరుడిగా ప్రశ్నించాల్సిన బాధ్యత నాకు ఉంది. ఈమధ్య తమిళనాడు తూత్తుకూడిలో జరిగిన ఘటనలో అధికారికంగా 13 మంది చనిపోయారని అంటున్నారు. కానీ 30 మంది దాకా అనధికారికంగా చనిపోయారని అంటున్నారు. చనిపోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. అసలు ఆ ఘటన జరగడానికి కారణం ఎవరు? కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను వేసే ఒకే ఒక ప్రశ్న.. ఆ రోజు షూటింగ్ ఆర్డర్స్ ఎవరు ఇచ్చారు? అనే ప్రశ్నకు ప్రధాని నరేంద్ర మోది, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం జవాబు చెప్పే తీరాలి అన్నారు.