Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

సమ్మర్‌కు మరో విజువల్ వండర్.. 11 భాషల్లో "హనుమాన్" రిలీజ్

Written By వరుణ్
Updated: సోమవారం, 9 జనవరి 2023 (15:40 IST)
వేసవిలో మరో విజువల్ వండర్ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రం పేరు "హనుమాన్". ఏకంగా 11 భాషల్లో తెరకెక్కింది. ప్రశాంత్ వర్మ దర్శకుడు. ఈయన సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత "కల్కి", "జాంబిరెడ్డి" వంటి వరుస విభిన్న చిత్రాలతో గుర్తింపు పొందారు. ప్రస్తుతం యంగ్ హీరో తేజసజ్జాతో కలిసి "హనుమాన్" మూవీని తెరకెక్కించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ చిత్ర బృందం రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్లు సినిమాపై విపరీతమైన అంచనాలను పెంచేసింది. 
 
తాజాగా చిత్రం విడుదల తేదీని ప్రకటించింది. సమ్మర్ కానుకగా మే 12వ తేదీన విడుదల చేయనున్నట్టు అధికారికంగా వెల్లడించింది. ఇందులో నాలుగు దక్షిణాది భాషలతో పాటు హిందీ, జపనీస్, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్‌తో సహా ఇతర భాషలు కూడా ఉన్నాయి. ఒక తెలుగు చిత్రాన్ని ఇన్ని భాషల్లో రిలీజ్ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కంటెంట్ మీదున్న నమ్మకంతోనే ఈ సాహసం చేస్తున్నట్టు దర్శక నిర్మాతలు చెబుతున్నారు. 

అన్నీ చూడండి

ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై నిషేధం.. ఈ దాడికి, టెహ్రాన్‌కు సంబంధం ఉన్నట్లు తెలిస్తే.. ట్రంప్ వార్నింగ్

Amaravati: అమరావతిని అత్యంత సురక్షితమైన నగరంగా తీర్చిదిద్దుతాం.. నారాయణ

గుంటూరులో ఇండోనేషియా, థాయ్ ప్రతినిధులు.. ఏపీ వ్యవసాయ పద్ధతులపై కితాబు

కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై కాంగ్రెస్ నేతలు ఎందుకు నోరెత్తట్లేదు.. కిషన్ రెడ్డి ప్రశ్న

కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై దాడి చేసిన ఒమన్ పైలట్... కాళ్లను ఉపయోగించి ఆ పని చేశాడు..(ఏఐ వీడియో)

అన్నీ చూడండి

LDL కొలెస్ట్రాల్‌పై 5 సాధారణ అపోహలు- వాస్తవాలు: ఆరోగ్యంగా ఉన్నట్లనిపించడం అంటే గుండె కూడా సురక్షితంగా ఉందని కాదు

టైప్ 2 డయాబెటిస్ వ్యాధి అదుపు చేసే మార్గాలు

గుండె అత్యవసర పరిస్థితులపై సన్నద్ధతను బలోపేతం చేస్తున్న సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్

bad cholesterol, చెడు కొవ్వు కరిగించే పదార్థాలు

వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్‌నెస్

తర్వాతి కథనం
Show comments