శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2020 (11:03 IST)

కింగ్ నాగార్జున పుట్టిన రోజు.. వైల్డ్ డాగ్ నుంచి పోస్టర్.. మన్మథుడి సినీ జర్నీ గురించి?

కింగ్ నాగార్జున పుట్టిన రోజు నేడు. నటుడిగా, నిర్మాతగా, వ్యాఖ్యాతగా ఇలా అన్ని విభాగాలలో తనదైన ముద్ర వేసుకున్న నాగార్జునకు అభిమానుల నుండే కాక సెలబ్రిటీల నుండి శుభాకాంక్షల వెల్లువ కురుస్తుంది. ప్రస్తుతం నాగ్ వైల్డ్ డాగ్ అనే సినిమా చేస్తుండగా, ఆయన బర్త్‌డే గిఫ్ట్‌గా పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆరు పదులు దాటిన ఇంకా గ్లామర్‌గా కనిపిస్తూ కుర్ర హీరోలకి సవాల్ విసురుతున్నాడు. 
 
టాలీవుడ్‌లో ప్రయోగాత్మక సినిమాలు చేసే హీరోల్లో నాగార్జున ముందు వరుసలో ఉంటారు. కమర్షియల్, ఆధ్యాత్మిక సినిమాలతో పాటు 'గగనం', 'ఊపిరి' వంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసిన నాగ్‌.. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అహిషోర్ సాల్మోన్ దర్శకత్వంలో 'వైల్డ్ డాగ్‌' చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాలో డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్‌తో నాగ్ టీంని పరిచయం చేసింది చిత్ర బృందం.
 
ఈ సినిమాలో నాగార్జున ఎన్‌.ఐ.ఎ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలు. కిరణ్ కుమార్ డైలాగ్స్ రాశారు. షానియల్ డియో సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
 
ఇక కింగ్ నాగార్జున గురించి..?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడిగా నాగార్జున అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు తండ్రి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. అరవై సంవత్సరాలు వచ్చిన అమ్మాయిల మనసులో ఇంకా మన్మథుడు గానే ఉన్నారు. నాగార్జున తండ్రి అక్కినేని బాటలో నటుడిగా నిర్మాతగా రాణిస్తున్నారు. అక్కినేని తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌కు సంబంధించిన బరువు బాధ్యతలు కూడా చూసుకుంటున్నారు. 
 
నాగార్జున ఆగష్టు 29, 1959న చెన్నైలో అక్కినేని నాగేశ్వర రావు, అన్నపూర్ణ దంపతులకి రెండవ కుమారుడుగా జన్మించారు. 1986లో విక్రమ్ సినిమాతో పరిచయం అయ్యారు. ఈ సినిమా బాలీవుడ్‌లో వచ్చిన హిందీ మూవీకి రీమేక్. ఇక మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన గీతాంజలి చిత్రం నాగార్జునకి నటుడుగా మంచి పేరును తీసుకువచ్చింది. 
Nagarjuna
 
1989లో వచ్చిన శివ సినిమా నాగార్జున స్థాయిని, తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచింది. ఈ సినిమాతోనే రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇక ఇదే సినిమాతో నాగార్జున బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన గీతాంజలి చిత్రం నాగార్జునకి నటుడుగా మంచి పేరును తీసుకువచ్చింది. 
 
1990 మొదటిభార్యకు లక్ష్మికి విడాకులు ఇచ్చి, 1992లో అమలను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకి అఖిల్ జన్మించారు. ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన హలో బ్రదర్ సినిమా నాగ్‌ని స్టార్ హీరోగా మార్చేసింది. నిన్నే పెళ్ళడతా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకి గాను ఏకంగా తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు లభించింది. ఆవిడా మా ఆవిడే, నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా, ఎదురులేని మనిషి మొదలగు సినిమాలు హీరోగా నాగార్జున స్థాయిని పెంచాయి.
 
2000 నుంచి 2002 మధ్యలో నాగార్జున గ్రాఫ్ పడిపోయింది. చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయాయి. ఇక 2002 లో వచ్చిన సంతోషం, మన్మధుడు సినిమాలు నాగర్జున గ్రాప్‌ని పెంచాయి. ఈ రెండు సినిమాలకి గాను నాగ్‌కి నంది అవార్డులు లభించాయి. మొత్తం నాగార్జున ఇప్పటివరకు ఒక జాతీయ అవార్డు (అన్నమయ్య), 9 రాష్ట్ర నంది అవార్డులు, 3 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకున్నాడు. తర్వాత శివమణి, మాస్ చిత్రాలు హిట్ ఇచ్చాయి.
amala - nagarjuna
 
మళ్ళీ ఎవరు ఉహించని విధంగా శ్రీరామదాసు చిత్రాన్ని చేసి మంచి హిట్ కొట్టారు నాగార్జున.. ఇదే తరహాలో షిరిడి సాయి అనే సినిమాలో కూడా నటించి మెప్పించారు నాగార్జున.మనం సినిమాలో నాగ్ తన మొత్తం కుటుంబంతో కలిసి నటించాడు ఇది తెలుగులో మరే హీరోకి కూడా ఇలాంటి ఘనత దక్కలేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ సినీ హీరోగానే కాకుండా బడా నిర్మాతల్లో నాగార్జున ఒకరిగా నిలుస్తు వస్తున్నారు. 
 
అంతేకాకుండా మంచి బిజినెస్ మెన్ గా కూడా నాగార్జునకి మంచి పేరుంది. వెండితెర పైన కాకుండా బుల్లితెర పైన కూడా నాగార్జున అదరగొట్టారు.. మీలో ఎవరు కోటిశ్వరుడు, బిగ్ బాస్ షోలు ఆయనకి మంచి పేరును తీసుకువచ్చాయి.