Daily Horoscope
✕

దేవ బ్రాహ్మణులపై కామెంట్స్.. క్షమాపణలు చెప్పిన బాలయ్య

Written By సెల్వి
Updated: ఆదివారం, 15 జనవరి 2023 (16:30 IST)
వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్‌లో నందమూరి హీరో బాలకృష్ణ  దేవ బ్రాహ్మణులకు వర్తించేలా కామెంట్లు చేశారు. దేవ బ్రాహ్మణుల గురువు దేవల మహర్షి అని వారి నాయకుడు రావణుడు అంటూ బాలయ్య వ్యాఖ్యానించారు. దీంతో ఆ వర్గానికి చెందిన ప్రజలు బాలకృష్ణపై ఫైర్ అయ్యారు. 
 
ఈ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన దేవ బ్రాహ్మణులు.. బాలయ్యకు చరిత్ర తెలియకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన చెందారు. ఈ వివాదం బాలకృష్ణ దృష్టికి చేరడంతో ఆయన స్పందించారు. 
 
దీనిపై బాలకృష్ణ వివరణ ఇస్తూ.. ఎవరిని కించపరిచేలా ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఇతరుల మనోభావాలను నొప్పించే తత్వం తనది కాదని క్షమాపణలు చెప్పారు. ఈ వ్యాఖ్యలు పొరపాటున వచ్చాయని సంజాయిషీ ఇచ్చారు. తనకు తెలియని సమాచారాన్ని తెలపినందుకు బ్రాహ్మణ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపినట్లు బాలకృష్ణ తెలిపారు. 

అన్నీ చూడండి

తిరుపరంగుండ్రంలో వానర రూపంలో హనుమంతుని రాక జరిగిందా? (video)

విద్యార్థినులను వేధించిన ప్రభుత్వ టీచర్.. అరెస్ట్ చేసిన పోలీసులు

ఆప్ఘనిస్థాన్‌ పాఠశాల సమీపంలో పేలుడు.. పది మంది మృతి.. 110 మందికి గాయాలు

తిరుప్పరంకుండ్రం కొండపై వెలిగించిన పవిత్ర దీపం- ధర్మ విజయం (video)

డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది.. కేటీఆర్

అన్నీ చూడండి

చీజ్ పఫ్‌తో ఆరోగ్య సమస్యలు... ఏంటవి?

శీతాకాలంలో నెయ్యి సైడ్ ఎఫెక్ట్స్

ఏపీలో సమాజ ఆధారిత కేన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపులో ఫైజర్- టాటా కేన్సర్ కేర్ ఫౌండేషన్

కాలేయ ఆరోగ్యానికి సహాయపడే సహజ పద్ధతులు ఏమిటి?

నెఫ్రోప్లస్: డయాలిసిస్‌కు అనుకూలమైన ఆహారోత్సవం ద్వారా రోగులు, సంరక్షకులను ఒకేచోట

తర్వాతి కథనం
Show comments