ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (12:27 IST)

హీరో కృష్ణంరాజు తుంటి ఎముకకు ఆపరేషన్

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సీనియర్ హీరో కృష్ణంరాజు ఆస్పత్రిలో చేరారు. హైదరాబాద్, జూబ్లీ హిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో మంగళవారం అడ్మిట్ అయ్యారు. ఆయన తన ఇంటిలో కాలుజారి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన తుంటికి ఫ్రాక్చర్ అయ్యింది. 
 
దీంతో ఆయన తుంటి ఎముకకు మంగళవారం ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. కృష్ణంరాజు ఆరోగ్యం బాగుందని.. కేవలం రొటీన్ హెల్త్ చెకప్ కోసం అపోలోకి వచ్చినట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. 
 
మరోవైపు, ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హీరో సాయిధరమ్ తేజ్ కుటుంబ సభ్యులతో ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను అని కృష్ణంరాజు గారు చెప్పారు.