గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 ఏప్రియల్ 2021 (11:22 IST)

రాంచి ఆస్పత్రిలో ధోనీ తల్లిదండ్రులు... చెన్నైలో ధోనీ!

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తల్లిదండ్రులకు కరోనా వైరస్ సోకింది. దీంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ధోనీ తల్లి దేవ‌కీ దేవి, తండ్రి పాన్ సింగ్‌ల‌కు కాస్త నలతగా ఉండటంతో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించారు. 
 
ఈ ఫలితాల్లో పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఇద్ద‌రినీ రాంచీలోని ప‌ల్స్ అనే సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్‌లో అడ్మిట్ చేశారు. ప్ర‌స్తుతం వీళ్లిద్ద‌రి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉన్న‌ట్లు డాక్ట‌ర్లు చెప్పారు. 
 
ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్న ధోనీ ప్ర‌స్తుతం ముంబైలో ఉన్న విష‌యం తెలిసిందే. బుధ‌వారం కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో మ్యాచ్‌కు అత‌డు సిద్ధ‌మ‌వుతున్నాడు. గ‌తేడాది ఐపీఎల్ త‌ర్వాత ధోనీ నాలుగైదు నెల‌ల పాటు త‌న కుటుంబంతోనే గ‌డిపాడు. 14వ సీజ‌న్ కోసం మార్చిలో మరోసారి చెన్నై టీమ్‌తో క‌లిశాడు.