శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2021
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 ఏప్రియల్ 2021 (08:11 IST)

ధోనీ ఖాతాలో అరుదైన రికార్డ్.. 200 మ్యాచ్‌లు.. 216 సిక్సుల మోత..!

చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్ర సింగ్ ధోనీ మరో అరుదైన రికార్డున తన ఖాతాలో వేసుకున్నాడు. చెన్నై తరఫున 200 మ్యాచులు ఆడిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీకి ఇన్ని మ్యాచులు ఆడిన తొలి క్రికెటర్ ధోనీనే కావడం విశేషం. 
 
పంజాబ్ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచులో ధోనీ ఈ ఘనత సాధించాడు. ఇది ఐపీఎల్‌లో ధోనీకి 206వ మ్యాచ్. ఈ టోర్నమెంట్ చరిత్రలో ఇన్ని మ్యాచులు ఆడిన క్రికెటర్ కూడా ధోనీనే కావడం గమనార్హం. 
 
తాను ఆడిన 206 మ్యాచుల్లో ధోనీ 40.63 సగటుతో 4,632 పరుగులు చేశాడు. ఇలా ఒక టోర్నీలో ఒక ఫ్రాంచైజీకి అత్యథిక మ్యాచులు ఆడిన క్రికెటర్‌గా ధోనీ రికార్డు సృష్టించడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఐపీఎల్‌లో అత్యధిక సిక్సుల మోత మోగించిన క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. ఇప్పటివరకు ధోనీ 216 సిక్సులు సాధించాడు.