సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 19 ఏప్రియల్ 2021 (12:38 IST)

కన్నబిడ్డనే కాటేసిన కామాంధుడు.. ఆరేళ్ల కూతురిపై..?

కన్నబిడ్డనే ఓ కామాంధుడు కాటేశాడు. ముక్కుపచ్చలు కూడా ఆరని ఆరేళ్ల కన్న కూతురిపై ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యం మత్తులో కూతురుపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిర్మల్ జిల్లా సోన్ మండలం గాంధీ నగర్‌లో శనివారం జరగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల ప్రకారం.. శనివారం ఉదయం తల్లి కూలి పనికి వెళ్లింది. 
 
అప్పటికే తాగిన మైకంలో ఉన్న తండ్రి ఒంటరిగా ఉన్న ఆరేళ్ల కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తన పశువాంఛను తీర్చుకోవడానికి వయసు బేధం కూడా చూడలేక ప్రవర్తించాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లి తన కూతురు నడవలేని స్థితిలో తీవ్ర రక్తస్రావంతో ఉండటాన్ని గమనించింది. 
 
అనుమానంతో కూతురుని అడగగా నాన్నే ఈ దారుణానికి పాల్పడినట్లు ఆ బాలిక చెప్పింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆగ్రహంతో రగిలిపోయారు. ఆ నీచుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.