శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 19 ఏప్రియల్ 2021 (13:56 IST)

కరోనా విషాధ గాథ.. కొడుకు మృతదేహాన్ని భుజాన వేసుకుని..?

కరోనా నేపథ్యంలో అనేక విషాద గాథలు బయటపడ్డాయి. తాజాగా యూపీలో జరిగిన ఓ అందరినీ కంటతడిపెట్టిస్తోంది. తన 13 ఏళ్ల కొడుకు మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ తండ్రి విలవిలలాడిపోయాడు. ఇందుకోసం ఎంతమందిని ప్రార్థించినా.. లాభం లేకపోవడంతో చివరికి తానే కాలువ పక్కన గొయ్యి తవ్వి కొడుకు మృతదేహాన్ని పూడ్చి పెట్టాడు. 
 
ఈ ఘటన లక్నో పరిధిలోని చినాహట్ ప్రాంతంలో జరిగింది. బాధితుడు సూరజ్‌పాల్ కొడుకుకు వారం రోజుులుగా తీవ్రమైన జ్వరం వస్తోంది. దీంతో ఇంటి దగ్గరే ఉండి చికిత్స అందుకుంటున్నాడు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందాడు. 
 
కరోనా భయంతో ఆ బాలుని మృతదేహాన్ని స్మశాన వాటిక వరకూ తీసుకు వెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో తండ్రే తన కుమారుని మృతదేహాన్ని భుజాల మీద వేసుకుని కాలువ వరకూ తీసుకువెళ్లి, అక్కడ ఖననం చేశాడు.