శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 ఏప్రియల్ 2021 (11:19 IST)

కోవిడ్ సెకండ్ వేవ్.. ధోనీ తల్లిదండ్రులకు కరోనా... ఆస్పత్రిలో చేరిక

దేశంలో కరోనా విజృంభిస్తోంది. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా అనేకమంది ఆస్పత్రి పాలవుతున్నారు. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు కోవిడ్ కోరల నుంచి తప్పించుకోలేకపోతున్నారు. తాజాగా ఇండియన్ టీమ్ మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ తల్లి దేవకీ దేవి, తండ్రి పాన్ సింగ్‌లకు కరోనా సోకింది. దీంతో ఇద్దరినీ రాంచీలోని పల్స్ అనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. 
 
ప్రస్తుతం వీళ్లిద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్న ధోనీ ప్రస్తుతం ముంబైలో ఉన్న విషయం తెలిసిందే. బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌కు అతడు సిద్ధమవుతున్నాడు. గతేడాది ఐపీఎల్ తర్వాత ధోనీ నాలుగైదు నెలల పాటు తన కుటుంబంతోనే గడిపాడు. 14వ సీజన్ కోసం మార్చిలో మరోసారి చెన్నై టీమ్‌తో కలిశాడు.