బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 4 మే 2018 (15:49 IST)

60 రోజులు... రూ.90 కోట్లు : ప్రభాస్ యాక్షన్ ఘట్టం ఖర్చు...

యూనివర్శల్ స్టార్ ప్రభాస్ "బాహుబలి" చిత్రం తర్వాత నటిస్తున్న చిత్రం "సాహో". ఈ చిత్రం షూటింగ్ దుబాయ్‌లో జరుపుకుంటోంది. ఇక్కడ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ ఘట్టం కోసం హాలీవుడ్ ఫైట్

యూనివర్శల్ స్టార్ ప్రభాస్ "బాహుబలి" చిత్రం తర్వాత నటిస్తున్న చిత్రం "సాహో". ఈ చిత్రం షూటింగ్ దుబాయ్‌లో జరుపుకుంటోంది. ఇక్కడ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ ఘట్టం కోసం హాలీవుడ్ ఫైట్ మాస్టర్లు పని చేస్తున్నారు. అయితే, ఈ ఫైట్ సన్నివేశాల కోసం ఏకంగా రూ.90 కోట్లను ఖర్చు చేస్తున్నారు. మొత్తం రెండు నెలల పాటు ఈ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
 
ఈ చిత్రం షూటింగ్‌లో భాగంగా, దుబాయ్‌ రహదారుల్లో ప్రభాస్‌పై ఛేజింగ్‌ దృశ్యాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ఫైట్‌ కోసం ఏకంగా 60 రోజులు కేటాయించారని తెలుస్తోంది. 'సినిమాలో చాలా కీలకమైన సన్నివేశంలో వచ్చే ఛేజింగ్‌ ఇది. అంతర్జాతీయ స్థాయిలో ఉండాలన్న ఆలోచనతో ఈ స్థాయిలో ఖర్చు పెడుతున్నాం' అని యూవీ క్రియేషన్స్‌కి చెందిన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 
 
కాగా, సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. దాదాపు రూ.300 కోట్లతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్‌కు ఏమాత్రం తగ్గకుండా నిర్మిస్తుండటం గమనార్హం.