సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: శుక్రవారం, 4 మే 2018 (12:05 IST)

మెహబూబా సెన్సార్‌ టాక్ విని ఛార్మి ఏం చేసింది..?

డేరింగ్ & డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం మెహ‌బూబా. పూరి.. త‌న‌యుడు ఆకాష్ పూరిని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ రూపొందించిన మెహ‌బూబా చిత్రం ఈ నెల 11న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. అభిరుచి గ‌ల నిర్మాత దిల్

డేరింగ్ & డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం మెహ‌బూబా. పూరి.. త‌న‌యుడు ఆకాష్ పూరిని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ రూపొందించిన మెహ‌బూబా చిత్రం ఈ నెల 11న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. అభిరుచి గ‌ల నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర ఫిలింస్‌ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. కాగా, ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది.

 
ఈ మూవీకి ఫ‌స్ట్ నుంచి పాజిటివ్ టాక్ ఉంది. దీనికి తోడు దిల్ రాజు ఈ మూవీని రిలీజ్ చేస్తుండ‌టంతో మ‌రింత క్రేజ్ ఏర్ప‌డింది. సెన్సార్ స‌భ్యులు ఈ సినిమాని చూసి అభినందించ‌డంతో ఛార్మి తెగ సంబ‌ర‌ప‌డిపోతుంద‌ట‌. ఇలా సెన్సార్ టాక్ తెలిసిందో లేదో వెంట‌నే ఛార్మి త‌న సంతోషాన్ని సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. ఇంత‌కీ ఛార్మి ఏమన్న‌దంటే... సెన్సార్ బోర్డు సభ్యులకు సినిమా చాలా బాగా నచ్చ‌డంతో మ‌రింత‌ కాన్ఫిడెన్స్ పెరిగింది. ఆకాష్‌ చాలా బాగున్నాడు. లవ్‌ స్టోరీ చాలా బాగుంది అని పదేపదే చెప్పడంతో మాకు చాలా ఎనర్జీ వచ్చింది. 
 
సినిమాపై మరింత కాన్ఫిడెన్స్‌ వచ్చింది. ఈ సందర్భంగా సెన్సార్‌ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మే 11న ప్రపంచవ్యాప్తంగా ‘మెహబూబా’ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం అని చెప్పింది. కాగా, 1971లో జరిగిన ఇండో-పాక్‌ యుద్ధ నేపథ్యంలో జరిగే లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌కి సందీప్‌ చౌతా సంగీతం మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంద‌ట‌. మ‌రి... చాలా కాలం నుంచి స‌రైన స‌క్స‌స్ కోసం వెయిట్ చేస్తోన్న పూరికి మెహ‌బూబా అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు మంచి విజ‌యాన్ని అందిస్తుంద‌ని ఆశిద్దాం.