బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 11 జులై 2017 (15:25 IST)

కూతురు కనుక హీరోయిన్‌ను చేస్తున్నా : శివాని సినీ అరంగేట్రంపై హీరో రాజశేఖర్

డాక్టర్ జీవిత రాజశేఖర్ కుమార్తె శివాని వెండితెర అరంగేట్రం ఖరారైంది. ఈ విషయంపై హీరో రాజశేఖర్ కూడా క్లారిటీ ఇచ్చేశారు. సాధారణంగా ఏ రంగంలో ఉన్నవారు ఆ రంగంలోనే తమ పిల్లలు కొనసాగాలని కోరుకుంటారు. అలాగే తన

డాక్టర్ జీవిత రాజశేఖర్ కుమార్తె శివాని వెండితెర అరంగేట్రం ఖరారైంది. ఈ విషయంపై హీరో రాజశేఖర్ కూడా క్లారిటీ ఇచ్చేశారు. సాధారణంగా ఏ రంగంలో ఉన్నవారు ఆ రంగంలోనే తమ పిల్లలు కొనసాగాలని కోరుకుంటారు. అలాగే తన కూతురు 'శివాని' సినిమా రంగంలో కొనసాగాలని తాను అనుకున్నానని చెప్పారు. తనకి కొడుకు ఉంటే హీరోను చేసి ఉండేవాడిననీ.. కూతురు కనుక హీరోయిన్‌ను చేస్తున్నానని స్పష్టం చేశారు.
 
సాధారణంగా సాధారణంగా స్టార్ హీరోల తనయులు హీరోలుగా వెండితెరకు వస్తుంటారు. ఇక స్టార్ హీరోల కూతుళ్ల విషయానికి వస్తే, వాళ్లలో కథానాయికలుగా తెరపైకి వస్తున్న వాళ్లు చాలా తక్కువ. కానీ, జీవిత రాజశేఖర్ మాత్రం తమ కుమార్తెను హీరోయిన్‌గా పరిచయం చేయాలని నిర్ణయించారు. కూతుళ్లను ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి ఆలోచిస్తున్నవారి అభిప్రాయం సరిగ్గా లేనట్టేననీ, ఇది కూడా అన్ని రంగాల వంటిదేనని రాజశేఖర్ చెప్పడం కొసమెరుపు.