సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 సెప్టెంబరు 2023 (12:29 IST)

ఓజీ నుంచి ట్రైలర్... పవన్ కల్యాణ్ బర్త్ డే స్పెషల్

OG Teaser
OG Teaser
"సాహో" డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తోన్న సినిమా ఓజీ. ఇందులో పవన్ హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అప్డేట్స్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ మూవీ నుంచి టీజర్ వస్తుందా అని వెయిట్ చేస్తున్న అభిమానులకు శుక్రవారం మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. 
 
శనివారం పవన్ బర్త్ డే సందర్భంగా ఓజీ టీజర్ రిలీజ్ అయ్యింది. తాజాగా ఓజీ టీజర్ రిలీజ్ చేస్తూ పవన్ అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. ఈ సినిమాలో గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి కీలకపాత్రలలో కనిపించనున్నారు. 
 
ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తాడని సమాచారం. ఈ టీజర్ 99 సెకండ్స్ ఉంది. పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుఫాన్ గుర్తుందా.. అంటూ పవర్ ఫుల్ వాయిస్ ఓవర్‌తో ఈ గ్లింప్స్ మొదలైంది. అప్పుడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటిదాకా ఏ తుఫాను కడగలేకపోయింది. 
 
అలాంటోడు మళ్ళీ వస్తున్నాడు అంటే.. అని పవన్ కళ్యాణ్‌కి పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చారు. ఇక పవన్ ఇందులో కత్తి పట్టుకొని ఫైట్ చేయడం, గన్ పట్టుకొని కాల్చడం చూపించారు. ఈ గ్లింప్స్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.