సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 4 మే 2024 (14:40 IST)

వైఎస్ జగన్ గురించి నిజం చెప్పకపోతే అబద్ధాలను ప్రోత్సహించినట్లే : కోన వెంకట్

Kona venkat at bapatla
Kona venkat at bapatla
ఇప్పటికే నిర్మాత నట్టికుమార్, నాగార్జున అక్కినేని ఎ.పి. గురించి మాట్లాడిన మాటలు సినీ ఇండస్ట్రీలో చర్చగా మారాయి. తాజాగా అందులో కోన వెంటక్ చేరాడు. గత నెలలో గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాను రూపొందించిన రచయిత కోనవెంకట్ ఆంధ్రప్రదేశ్ వెళ్ళి అక్కడనుంచి ఫొటోలు ఫేర్ చేసి ముఖ్యమంత్రిని పొగుడుతూ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశాడు.
 
నేను హైదరాబాద్ ORR (ఔటర్ రింగ్ రోడ్)లో లేను...నేను బంజారాహిల్స్ లేదా జూబ్లీహిల్స్ రోడ్లపై నిలబడను!! యస్స్స్స్..  నేను నా స్వస్థలం బాపట్ల రోడ్లపై ఉన్నాను. మన పట్టణాలు మరియు నగరాలు ఏ కాస్మోపాలిటన్ సిటీ కంటే తక్కువ కాదని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను.
 
ఇది ఖచ్చితంగా మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ యొక్క అద్భుతమైన అభివృద్ధి మన ముఖ్యమంత్రికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.  వైఎస్ జగన్ గ్రోత్ మరియు శ్రేయస్సులో A.P ని అగ్రస్థానంలో ఉంచడానికి మీరు చేస్తున్న కృషికి గారూ  అని సంబోధించాలనుకున్నా. *నిజం చెప్పకపోతే అబద్ధాలను ప్రోత్సహించినట్లే" అంటూ మనసులోని మాటను తెలిపారు.